నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు ఆదేశించగానే కనీసం విచారణ జరపకుండా జత్వానీపై కేసు నమోదు చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. విజయవాడ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కుక్కల నాగేశ్వరరావు ఫిర్యాదు ఇవ్వగానే తనను, తన కుటుంబ సభ్యులను ముంబైలో అరెస్ట్ చేసి ఐదు రోజులపాటు, ఎన్టీపీసీ గెస్ట్ హౌసులో పెట్టి చిత్రహింసలు పెట్టారని జత్వానీ తాజాగా ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన సీఐ చంద్రశేఖర్, న్యాయసలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని చెప్పారు.
జత్వానీ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కూడా చర్యలకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అప్పటి నిఘా విభాగం అధిపతి సీతారామాంజనేయులు, విజయవాడ అప్పటి డీసీపీ విశాల్ గున్ని, విజయవాడ సీపీగా చేసిన కాంతిరాణాలపై కూడా జత్వానీ లిఖతపూర్వక ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని అందుకే ఫిర్యాదు చేస్తున్నట్లు జత్వానీ తరపు న్యాయవాదులు తెలిపారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్పై ఎఫ్ఐఆర్ నమోదు