బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌కు తోడు దేశీయంగానూ కొనుగోళ్ళు పెరగడంతో పుత్తడి ధరలు రెండు నెలల గరిష్ఠాన్ని తాకాయి. శుక్రవారం నాడు పది గ్రాముల బంగారం ధరపై రూ. 1,200 పెరిగి రూ. 75,550కి చేరింది. అంతకుముందు ఈ ధర రూ. 74,350గా ఉంది.
హైదరాబాద్‌లో 99.9 స్వచ్ఛత ఉన్న 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 1,300 పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం కొనుగోలుకు రూ. 74,450 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 1200 పెరిగి రూ. 68,250కి చేరింది.
వెండి ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో శుక్రవారం కిలో వెండిపై రూ. 2 వేలు పెరిగి రూ. 89 వేలకు చేరింది.
గత నాలుగు రోజుల్లో కిలో వెండి ఏకంగా రూ. 5,200 పెరిగింది. హైదరాబాద్‌లో ఈ ధర రూ. 95 వేలుగా ఉంది.