పింఛనుదారులకు శుభవార్త. ఇక నుంచి ఇంటి వద్ద నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చని పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల పోస్టాఫీసులతోపాటు, డివైస్‌లతో ఇంటి వద్ద కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చని వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా ముఖ ఆధారిత విధానంలో కూడా పింఛను దారులు జిల్లా పోస్టాఫీసు కార్యాలయాల్లోనూ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చు.
పింఛను, పింఛనుదారుల సంక్షేమ కార్యాలయాల్లో నవంబరు 1 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ క్యాంపెయిన్ 3.0 పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనిపై ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. పింఛను పంపిణీ చేసే బ్యాంకులు, ఆధార్, సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుకోవాలని జిల్లాస్థాయి అధికారులకు సూచించారు.