రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ లో విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తప్పుపట్టారు. విదేశీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఎవరెవరితో సమావేశమవుతున్నారో చూస్తే విస్మయం కలుగుతోందన్నారు. భారత్ వ్యతిరేకి ఇల్హర్ ఒమర్‌తో రాహుల్ భేటీ అయ్యారని, ఖలిస్తాన్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఏజెంట్లతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ ఉగ్రవాదులతో సమావేశమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. విదేశాల్లో భారత్ గురించి చులకనగా మాట్లాడటం రాహుల్ కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ దినేష్ శర్మ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భారత్ ఎకానమీ ప్రపంచంలో 11వ స్ధానంలో ఉంటే, ప్రస్తుతం ఐదో స్థానంలో ఉందన్నారు.
త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్ అవతరించనుందన్నారు. రక్షణ రంగంలో భారత్ ప్రస్తుతం ఆయుధాలు తయారుచేస్తోందని, ఎడ్యుకేషన్ హబ్‌గా ఎదిగిందని వివరించారు. భారత్ పలు రంగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరుస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం విదేశీ పర్యటనల సందర్భంగా అసహనం వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు