సెబీ ఛైర్పర్సన్ మాధవీ పురి బుచ్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేశారు. మాధవీ పురి సెబీలో చేస్తూ ఐసీఐసీఐ నుంచి డబ్బు తీసుకున్నారని దీనిపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలంటూ లోక్‌పాల్‌లో ఎంపీ మొయిత్రా ఫిర్యాదు చేశారు. ఈ అవినీతిలో ప్రమేయమున్న ప్రతిఒక్కరినీ విచారించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సెబీ చీఫ్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న సమయంలో టీఎంసీ ఎంపీ మొయిత్రా మహువా ఫిర్యాదు చేయడం గమనార్హం. సెబీ చీఫ్‌పైనే అవినీతి ఆరోపణలు రావడం వల్ల పది కోట్ల మంది పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతుందన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారంగా తీసుకుని 1988 చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
2017 నుంచి నాలుగేళ్లపాటు సెబీ సభ్యురాలిగా ఉన్న మాధవీ, 2022లో సెబీ ఛైర్పర్సన్ అయ్యారు. సెబీలో ఛైర్పర్సన్ అయ్యాక కూడా ఐసీఐసీఐ నుంచి జీతాలు తీసుకున్నారని ఫిర్యాదులో వివరించారు. ఆమెకు భారీగా వేతనాలు అందడం వల్లే ఐసీఐసీఐపై విచారణలు నిలిచిపోయాయని మొయిత్రీ ఆరోపించారు. అయితే మాధవి బుచ్‌కు పదవీ విమరణ ప్రయోజనాలు తప్ప, మరి ఎలాంటి వేతనాలు చెల్లించలేదని ఐసిఐసిఐ ఓ ప్రకటనలో తెలిపింది.