ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన అవకతవకల కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో గతంలోనే కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు కాగా, తాజాగా సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణ గత వారమే పూర్తి కాగా తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి, కాసేపటి కిందట వెలువరించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న అరవింద్ కేజ్రీవాల్ నాలుగు మాసాలుగా జైల్లో ఉన్నారు. ఢిల్లీ మద్యం విధానాన్ని అనుయాయులకు దోచిపెట్టే విధంగా మార్చుకున్నారని, వంద కోట్లు చేతులు మారాయని ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించింది. ఆప్ సీనియర్ నేత సిసోదియా కూడా బెయిల్‌పై విడుదల అయ్యారు.