దేశంలో మరికొన్ని వందే భారత్ రైళ్ళు పరుగులు తీయనున్నాయి. మరో పది వందే భారత్ రైళ్ళను ప్రధాని మోదీ ఈ నెల 15న ప్రారంభించనున్నారు.
టాటా నగర్ – పాట్నా, వారణాసి – దియోఘర్, రాంచీ – గొడ్డ, దుర్గ్ – విశాఖపట్నం, టాటా నగర్ – బెర్హంపూర్ (ఒడిసా) రూర్కెలా – హౌరా, హౌరా – గయా, ఆగ్రా – వారణాసి మార్గాల్లో కొత్త రైళ్ళు పరుగులు తీయనున్నాయి.
ఇటీవలే ప్రధాని మోదీ మూడు కొత్త వందే భారత్ రైలు సర్వీసులు ప్రారంభించారు. ఆ రైళ్ళు మీరట్ – లక్నో, మథురై- బెంగళూరు, చెన్నై- నాగర్కోయిల్ల మధ్య నడుస్తున్నాయి.
సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో సుఖవంతంగా ప్రయాణించే అవకాశం ఉండటంతో ఈ సర్వీసులకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో మరో పది సర్వీసులు ప్రారంభించేందకు రైల్వే శాఖ సిద్ధమైంది.