విద్యా బోధనకు మదర్సాలు పనికిరావని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. మదర్సాల్లో బోధించే విద్య, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఆర్‌టీఈ పరిధిలోకి మదర్సాలు రాకపోవడంతో యూనిఫాం, మధ్యాహ్న భోజనం విద్యార్ధులకు అందడం లేదని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో తెలిపింది.
ఎన్‌సిఈఆర్టీ పుస్తకాల్లో కొన్ని అంశాలను మాత్రమే విద్యార్ధులకు బోధిస్తూ మదర్సాల యాజమాన్యాలు మోసం చేస్తున్నాయని సుప్రీంకోర్టుకు నివేదించింది. చదువుకోవడానికి మదర్సాలు సరైనవి కావని స్పష్టం చేసింది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 19, 21, 22, 24, 29కి విరుద్దంగా మదర్సాలు పనిచేస్తున్నాయని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పేర్కొంది.