కోల్కతా ఆర్జి కర్ డాక్టర్ హత్యాచారం ఘటన మరవక ముందే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. బిహార్లోని సమస్తిపుర్ జిల్లా ఆర్బిఎస్ ఆరోగ్యకేంద్రంలో అర్థరాత్రి ఓ నర్సుపై డాక్టర్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ అత్యాచారయత్నం చేశారు. నర్సు చేతికి దొరికిన ఆపరేషన్ బ్లేడుతో డాక్టర్ జననాంగాలను కోసేసింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో వారు రంగంలోకి దిగారు. అత్యాచారయత్నం జరిగిన సమయంలో డాక్టర్, అడ్మినిస్ట్రేటర్ మద్యం సేవించి ఉన్నారని పోలీసులు తెలిపారు.
బాధితురాలు ఫోన్ చేయగానే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు డాక్టర్, అడ్మినిస్ట్రేటర్, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దురాగతానికి పాల్పడే ముందే దుండగులు సీసీటీవీ ఆపేయడంతోపాటు, గేటుకు లోపల వైపు తాళం వేశారని డీఎస్పీ సంజయ్ కుమార్ పాండే వెల్లడించారు. డాక్టర్, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.