ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వివిధ కారణాలతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్లీ గాడిన పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. సచివాలయంలో ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
భూములు కలిగిన రైతులు, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పార్క్‌లు ఏర్పాటు చేసుకునే విధానాన్ని తీసుకురావాలని సూచించారు. ఆటోనగర్లను మోడ్రనైజేషన్ చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు సర్వీస్ అందించే విధంగా నైపుణ్యం పెంచాలన్నారు. నిర్మాణంలో ఉన్న 7 క్లస్టర్లను పూర్తి చెయ్యాలని ఆదేశించారు.
ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారెంటీకి రూ. 100 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. విశ్వకర్మవంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వ్యాపారులకు రుణాలు, ప్రోత్సాహకాలు, శిక్షణ అందేలా చూడాలని అన్నారు. హార్టికల్చర్, ఆక్వా కల్చర్ ఉత్పత్తులకు ఆహార శుద్ధి పరిశ్రమ ద్వారా ఆదాయాలు పెరుగుతాయన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు