సీనియర్ రాజకీయనేత, వామపక్ష యోధుడు సీతారం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యలతో వారం రోజులుగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1992 నుంచి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2005 నుంచి 12 సంవత్సరాల పాటు 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
సీతారాం ఏచూరి మద్రాసులో 1952లో జన్మించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, ఏపీ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజనీరుగా పనిచేశారు. తల్లి కల్పకం ఏచూరి కూడా అధికారిగా సేవలందించారు. ఏపీ మాజీ సీఎస్ మోహన్ కందాకు సీతారాం ఏచూరి మేనల్లుడు.
హైదరాబాద్ సెయింట్స్ పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన సీతారం ఏచూరి, ఢిల్లీ ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లోను చదువుకున్నారు. 1970 సీబీఎస్ఈ హయ్యర్ సెకండరీలో ఆలిండియా ర్యాంకరుగా నిలిచారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్‌లో బీఏ, ఢిల్లీ జేఎన్‌యూలో ఎంఏ పట్టా సాధించారు. అక్కడే పీహెచ్‌డిలో చేరారు. అత్యవసర సమయంలో జైలుకెళ్లారు. సీతారం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. విలేకరి సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం.
1975లో ఎస్ఎఫ్ఐ నేతగా ఆయన ప్రస్థానం మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టైన వారిలో సీతారం ఏచూరి కూడా ఉన్నారు. ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థులకు ప్రకాశ్ కారత్‌తో కలసి వామపక్షభావజాలాన్ని నింపారు. 1984లో సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడిగా 1992లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా చేశారు. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1996, 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాల్లో సీతారాం ఏచూరి క్రియాశీలకంగా పనిచేశారు. పత్రికల్లో అనేక కథనాలు కూడా రాశారు. కమ్యూనిజం వర్సెస్ సెక్యులరిజం పుస్తకాన్ని రచించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు