ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువును రాష్ట్రప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈనెల 15 నుంచి మరో వారం రోజుల వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 23 నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబరు 30 వరకూ పొడిగించింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(SEB) ను బుధవారం రద్దు చేసిన ప్రభుత్వం, అధికారులను, సిబ్బందిని ఎక్సైజ్‌శాఖలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. దీంతో గడువు పెంచాల్సి వచ్చింది.
ఏళ్ల తరబడిగా బదిలీలకు నోచుకోని ఉద్యోగులకు ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసింది. ఈ నెల 1 వ తేదీ నుంచి 15 వరకు బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని భావించింది. కానీ రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా బదిలీల వ్వవహారం ఆలస్యమైంది. ఈ కారణంగా మరోసారి ప్రభుత్వం బదిలీల గడువును పొడిగించింది.
ఏపీలో ఎన్డీయే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో బదిలీలపై ప్రత్యేక దృష్టిని సారించింది.