ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారంటూ అరెస్టైన సీఎం కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పును సుప్రీంకోర్టు రేపు వెలువరించనుంది. ఇప్పటికే పలు దఫాలు విచారించిన సుప్రీంకోర్టు రేపు తీర్పు వెలువరించనున్నట్లు ఆన్‌లైన్‌లో అప్ డేట్ ఇచ్చింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన రెండు సంవత్సరాల వరకు ఎలాంటి చర్యలు తీసుకోని సీబీఐ, ఎప్పుడైతే ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిందో ఆ వెంటనే అరెస్ట్ చేశారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
మద్యం కుంభకోణంలో ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. ఇక సుప్రీంకోర్టులో బెయిల్ లభిస్తుందని ఆశిస్తున్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కకపోతే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతోంది. అక్కడ పాలన స్థంభించిపోయిందని, అత్యవసరమైన దస్త్రాలు కూడా నిలిచిపోవడంతో పాలనా సంక్షోభం ఏర్పడింది. ఇప్పటికే దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.