ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణం అస్సాంలో ప్రకంపణలు రేపుతోంది. రూ.2 వేల కోట్ల ఈ కుంభకోణంలో ఇప్పటికే పోలీసులు విశాల్ పుకాన్ను అరెస్ట్ చేశారు. అతన్ని విచారించిన తరవాత ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నటి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరాకు నోటీసులు జారీ చేశారు. వారు హాజరుకాకపోవడంతో లుకవుట్ నోటీసులు జారీ చేసి, అరెస్ట్ చేశారు.
ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే రెండు నెలల్లో 30 శాతం లాభాలు వస్తాయంటూ నాలుగు నకిలీ సంస్థలను ఏర్పాటు చేసిన పుకాన్ దాదాపు రూ.2 వేల కోట్లు ప్రజల నుంచి దోచుకున్నారు. దోచుకున్న డబ్బుతో జల్సాలు చేయడం, సినిమాల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు అనేక ఆస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీని వెనుక కొందరు పెద్దలు ఉన్నట్లు అస్సాం ప్రభుత్వం అనుమానిస్తోంది. కేసు విచారణకు అస్సాం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది. తాజాగా నటి సుమిబోరాను అరెస్ట్ (actress arrest) చేయడం సంచలనంగా మారింది.