కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడికి మరో కీలక పదవి దక్కింది. ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్గా ఆయన వ్యవహరించే అవకాశం దక్కింది. దిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.
చైర్మన్ గా రామ్మోహన్నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
దేశం తరఫున తనకు అరుదైన గౌరవం దక్కడంపై రామ్మోహన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.