ప్రపంచంలోని ప్రతీ ఎలక్ట్రానిక్ డివైస్ లో భారత్‌లో తయారైన చిప్ ఉండాలనేది తమ ఆకాంక్ష అని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోనే 100 శాతం ఎలక్ట్రానిక్ తయారీ జరగాలన్నదే తన స్వప్నమన్నారు.
గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో ‘సెమికాన్ ఇండియా 2024’ను ప్రారంభించిన ప్రధాని మోదీ, భారత్‌ను సెమీ కండక్టర్ పవర్ హౌస్‌గా మార్చేందుకు చేయాల్సిందంతా తమ ప్రభుత్వం చేస్తుందన్నారు.
దేశంలో ప్రస్తుతం త్రీ డైమన్షనల్ పవర్ ఉందన్నారు. అనుకూలమైన ప్రభుత్వం, తయారీ రంగానికి సానుకూలమైన వాతావరణం, ఆశాజనక మార్కెట్ దేశంలో ఉందన్నారు.
పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి విలువను సృష్టించుకోవాలని సూచించారు. అందుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు.
భారత్‌లో మార్కెట్ లో అనుకూల వాతావరణం ఉందన్న ప్రధాని మోదీ, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే సరఫరా గొలుసు ముఖ్యమన్నారు. కరోనా సమయంలో భారత్‌కు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయని గుర్తు చేశారు.