ఏపీలో మద్యం పాలసీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో మద్యం కొత్త పాలసీ విధానానికి ఎన్డీయే ఏపీ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిది. సబ్ కమిటీ సభ్యులు గా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి ఉన్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానంతో పాటు తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
ఇప్పటికే అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి రూపొందించిన నివేదికను కూడా
ఈ సబ్ కమిటీ పరిశీలించనుంది. మద్యం పాలసీ రూపకల్పనకు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది.