మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా వినాయక మంటపంపై దాడి జరిగింది. ఆ సంఘటన గత రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో చోటు చేసుక్ది. సుమారు పాతిక మంది ముస్లిములు అల్లాహో అక్బర్ అని నినాదాలు చేస్తూ గణేశ మంటపం పెట్టిన ఇంటిపై రాళ్ళదాడికి పాల్పడ్డారు.
మంటపం పెట్టిన ఇంటి యజమానురాలు కిరణ్ చౌరసియా పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదులో ఇలా రాసారు. ‘‘ప్రతీ యేడాది లానే ఈ సంవత్సరం కూడా మా ఇంటి ముందు చిన్న గణపతి మంటపం ఏర్పాటు చేసాము. ప్రతీరోజూ సాయంత్రం సుమారు ఏడున్నర సమయంలో హారతి ఇచ్చే వేళకు స్థానిక భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. అదే సమయంలో సుమారు పాతిక మంది ముస్లిములు వచ్చి గణపతి మంటపం దగ్గర పోగవుతున్నారు. వారు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే నినాదాలు చేస్తున్నారు. అలా, హారతి ఇచ్చే సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.’’
కిరణ్ తన ఫిర్యాదులో గతరాత్రి జరిగిన సంఘటన గురించి వివరించారు. ‘‘సెప్టెంబర్ 10 మంగళవారం రాత్రి మా చౌరసియా కుటుంబ సభ్యులం హారతి ఇస్తున్నాం. ఆ సమయంలో సుమారు పాతిక మంది ముస్లిములు మా మంటపం మీద రాళ్ళు రువ్వారు. ఆ ఘటనలో గణపతి మూర్తి దెబ్బతింది. మా ధార్మిక విశ్వాసాలకు దెబ్బ తగిలింది. ఆ ముస్లిములు మమ్మల్ని బెదిరించారు కూడా. ఈ సంఘటన గురించి పోలీసులకు చెప్తే మేం మళ్ళీ దాడి చేస్తామని వారు బెదిరించారు’’ అని కిరణ్ తన ఫిర్యాదులో స్పష్టంగా రాసారు.
చౌరసియా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిన్‌హాట్ పోలీసులు సుమారు పాతిక మంది ఆగంతకుల మీద కేసు నమోదు చేసారు. ఒక అనుమానితుణ్ణి అరెస్ట్ కూడా చేసారు.
గణపతి మంటపం మీద ముస్లిముల రాళ్ళదాడి ఘటన గురించి తెలిసి, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అదుపుచేసే ప్రయత్నాలు ఫలించలేదు. మండపం మీద దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేసారు.
కిరణ్ భర్త ప్రదీప్ చౌరసియా, జరిగిన సంఘటనను వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో విడుదల చేసాడు. ‘‘మంగళవారం మా వీధిలో ఉన్న హనుమంతుడి గుడిలో విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను గుడికి వెళ్ళాను. నా భార్య, పిల్లలు ఇంట్లో ఉన్నారు. అప్పుడు సుమారు 25మంది వ్యక్తులు వచ్చారు. వారు అల్లాహో అక్బర్ అని నినాదాలు చేస్తూ మంటపం మీద రాళ్ళు రువ్వారు. సాయంకాల పూజను అడ్డుకున్నారు. మీరు మీ ఇంట్లో మీ దేవుణ్ణి పూజించుకోలేకపోతే, ఇంకెక్కడ పూజించుకోగలరు? మా గణపతి మండపం మీద రాళ్ళు రువ్విన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన డిమాండ్ చేసాడు.
ఈ సంఘటన గురించి డీసీపీ శశాంక్ సింగ్ మాట్లాడుతూ, ‘‘గంగావిహార్ కాలనీకి చెందిన కిరణ్ చౌరసియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ సమయంలో కొందరు యువకులు గణపతి పూజను అడ్డుకోడానికి ప్రయత్నించారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు వెళ్ళారు. ఈ విషయంలో కేసు నమోదయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంది’’ అని చెప్పారు.