ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లా పరిధిలో తోడేళ్ళ దాడులు ఆగడం లేదు. మానవ రక్తం రుచి మరిగిన తోడేళ్ళు పదే పదే దాడులకు దిగుతున్నాయి. రెండు నెలలుగా బహరాయిచ్ లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు తోడేళ్ళ దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నారు.
తాజాగా మరో చిన్నారిపై తోడేలు దాడి చేసి గాయపరిచింది. ప్రస్తుతం బాధిత చిన్నారి మహసి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 50 రోజులుగా ఆరు తోడేళ్ళ గుంపు జనాలపై దాడి చేస్తున్నాయి.
యూపీ సర్కార్ ఆపరేషన్ భేడియా చేపట్టి చేపట్టింది. ఇప్పటివరకూ ఐదు తోడేళ్లను బంధించింది, ఆరో తోడేలు కోసం గాలింపు కొనసాగుతోంది.
తోడేళ్ళను పట్టుకునేందుకు అటవీ శాఖాధికారులు చిన్న పిల్లల మూత్రంతో తడిసిన రంగు రంగుల టెడ్డీ బేర్లను అవి విశ్రాంతి తీసుకునే నదీ పరీవాహక ప్రాంతాల్లో పెడుతున్నారు. తోడేళ్లు రాత్రి వేళ నివాస ప్రాంతాల్లోకి వచ్చి దాడి చేసి మళ్ళీ వెళుతున్నాయి. దాదాపు 35 గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తోడేళ్ళ దాడుల్ని ‘వైల్డ్‌లైఫ్ డిజాస్టర్’గా ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రకటించింది.