బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పదో రోజు పర్యటించారు. బుడమేరు గండ్లు పూడ్చిన చోటుకు చంద్రబాబు కాలినడకన వెళ్ళి పరిశీలించారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు గట్లను పటిష్ఠం చేయకపోవడంతో పాటు ప్రకాశం బ్యారేజీకి 11.43 క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. దీనికి తోడు డ్రెయిన్లు పొంగడంతో ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు.
మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ అధికారులు తీవ్రంగా శ్రమించి గండ్లను పూడ్చారని వివరించారు. డ్రోన్ లైవ్ ద్వారా గండ్ల పూడ్చివేత పనులు పర్యవేక్షించామన్నారు. బుడమేరు వరదలతో 6లక్షల మంది జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. ఎంత ప్రయత్నించినా శివారు ప్రాంతాలకు సరిగా సాయం అందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు స్వచ్ఛదంగా సాయం అందిస్తుంటే వైసీపీ మాత్రం విషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాలో 11.20లక్షల క్యూసెక్కుల వరద ఉన్నప్పుడు నదిలో మూడు బోట్లు వదిలిపెట్టారు. ఆ బోట్లు కౌంటర్ వెయిట్ కు ఢీకొట్టడంతో ప్రమాదం తప్పిందన్నారు.
వరద ప్రాంతాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు, పారిశుధ్ద్య సిబ్బంది కష్టపడి పనిచేశారని కొనియాడారు. ప్రాణ నష్టం బాగా తగ్గించగల్గామన్నారు.
వరదలపై యుద్ధంలో గెలిచినా జరిగిన నష్టాన్ని మాత్రం పూడ్చలేకపోయామన్నారు. ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసి, అంతా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు సీఎం చంద్రబాబు