ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లను కేంద్రం నోటిఫై చేసింది. ఇందుకు 2008 జాతీయ రహదారుల ఫీజు నిబంధనలను కేంద్రం సవరించింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా టోల్ వసూళ్లు అమల్లోకి రానున్నాయి. ఇది అమల్లోకి వస్తే ఫాస్టాగ్ కనుమరుగు కానుంది.
శాటిలైట్ నావిగేషన్‌కు ఆన్ బోర్డు యూనిట్ ఏర్పాటు చేసుకున్న వాహనాలు టోల్ దాటినప్పుడు ఆటోమేటెడ్‌గా బ్యాంకు ఖాతా నుంచి టోల్ చెల్లింపు జరిగిపోతుంది. నావిగేషన్ వ్యవస్థ లేని వాహనాలకు సాధారణంగా వసూలు చేస్తారు. ఈ అత్యాధునిక వ్యవస్థ ద్వారా టోల్ వసూళ్లు చేయడానికి ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేస్తారు.
ప్రస్తుత విధానంలో జాతీయ రహదారులపై వాహనం ఎక్కగానే టోల్ గేటు వచ్చినా ఎక్కువ చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఆధునిక ఓబీయూ అందుబాటులోకి వస్తే ఎంత దూరం జాతీయ రహదారిపై ప్రయాణిస్తే అంతే చెల్లిస్తే సరిపోతుంది. దీని ద్వారా ప్రజలకు టోల్ ఖర్చు తగ్గుతుంది.