ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి గోదావరికి భారీగా వరద చేరుతోంది. చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ నుంచి కూడా వరద గోదావరిలో కలుస్తోంది. దీంతో 24 గంటల వ్యవధిలోనే గోదావరికి వరద పోటు భారీగా పెరిగింది.
సోమవారం మధ్యాహ్నం భద్రాచలం వద్ద నీటిమట్టం 26 అడుగులు ఉండగా మంగళవారం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు సాయంత్రానికి రెండోప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసి ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. గోదావరితో పాటు శబరి ఉపనది పోటెత్తడంతో ఏపీలోని పోలవరం ముంపు మండలాల్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. శబరి, సీలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో చింతూరు మండలంలోని పలు గ్రామాల్లోకి వరద చేరింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు