వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వినూత్న పద్ధతుల ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పలువురిని ఔట్లుక్ ఇండియా అవార్డులకు ఎంపిక చేసింది. దిల్లీలో జరిగిన ఔట్లుక్ అగ్రిటెక్ సమ్మిట్లో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేస్ చతుర్వేది ఈ అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో ఏపీకి చెందిన వారు ముగ్గురు ఉన్నారు.
జాతీయ అత్యుత్తమ కేవీకేగా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఎంపికైంది. ఆ కేంద్రం నుంచి శాస్త్రవేత్త జి.ధనలక్ష్మి అవార్డును అందుకున్నారు.
అనకాపల్లి కొందంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో సహజ పధ్ధతిలో వ్యవసాయం చేయడంతో పాటు కూరగాయలు పండిస్తున్న షేక్ యాకిరికి అవార్డు దక్కింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని మురళీకృష్ణ సహజ పద్ధతుల్లో మిల్లెట్స్ తో బిస్కెట్లు తయారు చేసినందుకు గాను అవార్డుకు ఎంపికయ్యాడు.