భారత్లో ఎంపాక్స్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారికంగా వెల్లడించింది. ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని పేర్కొంది. తొలుత అనుమానిత కేసుగా భావించిన వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచి పరీక్షలు నిర్వహించగా వ్యాధి నిర్ధారణ అయిందని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. ప్రయాణ సమయంలో సోకిన కేసుగా నిర్ధారించారు. రోగిలో పశ్చిమ ఆఫ్రికా క్లాడ్-2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఎంపాక్స్ నిర్ధారణపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కూడా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సదరు రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ ఉత్పన్నం కాలేదని తెలిపింది. జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు వివరించింది.