బంగ్లాదేశ్ మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేసి ఆ దేశ ప్రధాని యూనస్, భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రకటించారు. హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతూ రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రిజర్వేషన్లపై చెలరేగిన హింస తరవాత తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్, విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశమయ్యారు.
ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ విదేశాంగశాఖ సలహాదారు తౌహిద్ హుస్సేనీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజ్‌నాథ్ సింగ్ లక్నోలో కమాండర్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ గాజా, పాలస్తీనాలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునేలా సిద్ధంగా ఉండాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని హుసేనీ అన్నారు.
మరోవైపు బంగ్లాదేశ్ అదానీకి రూ.4 వేల కోట్ల బకాయిలు పడటంపై కంపెనీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న అదానీ కంపెనీకి బంగ్లాదేశ్ రూ.4 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.