ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో బాణా సంచా తయారీ, విక్రయాలను నిషేధించింది. శీతాకాలంలో కాలుష్యం నియంత్రిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఏటా శీతాకాలంలో ఢిల్లీ ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న సంగతి తెలిసిందే. రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ సర్కార్ ఇప్పటి నుంచే వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టింది.
ఢిల్లీలో కాలుష్య నియంత్రణ మండలి, ఢిల్లీ పోలీసులు బాణా సంచా తయారీపై నిఘా ఉంచుతారని మంత్రి తెలిపారు. ఆన్‌లైన్‌లో బాణా సంచా విక్రయాలు, డెలివరీలకు కూడా నిషేధం వర్తిస్తుంది. కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు లెక్కించేందుకు నగరంలో 21 ఫోకస్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.