భారీ కార్చిచ్చు అమెరికాను ముచ్చెమటలు పెడుతోంది. కాలిఫోర్నియాలోని బేస్లైన్, ఆల్ఫిన్ స్ట్రీట్ వద్ద పిడుగుపాటుతో అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటికే 20 వేల ఎకరాలకుపైగా అడవి కాలిపోయింది. శాన్ బెర్నార్డినో కౌంటీలో భారీగా అడవులు తగలబడుతున్నాయి. దావాగ్నిని ఆర్పేందుకు పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లను రప్పించి నీటిని చల్లుతున్నారు. హెలికాఫ్టర్ల ద్వారా రసాయనాలు, నీరు చల్లినా మంటలు అదుపులోకి రాకపోవడంతో కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
కాలిఫోర్నియా, నావాడలో అనేక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రీన్ వ్యాలీ, స్లీడర్ గెన్, లేక్ యారో హెచ్, వ్యాలీ ఆఫ్ ఎన్క్యాచ్మెంట్ ప్రాంతాల్లో వేలాది మందిని తరలించారు. గంటకు 6 వేల ఎకరాల్లో అడవులు తగలబడుతున్నాయి. ఒక్క రోజులోనే మంటలు 14 రెట్లు విస్తరించాయని అధికారులు తెలిపారు. భారీగా ఇళ్లు కాలిపోయాయి. ఆస్తినష్టం సంభవించింది. కార్చిచ్చును అదుపు చేసేందుకు పలు రాష్ట్రాల నుంచి హెలికాఫ్టర్లు, ఫైర్ ఇంజన్లు తెప్పించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు