అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. గడచిన 24 గంటల్లో ఉత్రరాంధ్రలోని పలు ప్రాంతాల్లో 18 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం బస్టాండ్ నీట మునిగింది. అల్లూరు జిల్లాలో ఏజన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓ బాలిక వాగులో కొట్టుకుపోయింది. అల్లూరు జిల్లాలోని ఏజన్సీలో కొండచరియలు విరిగిపడ్డాయి.
విశాఖ నగరంలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సీతమ్మధార ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. లోతట్టు కాలనీల ప్రజలను రెవెన్యూ అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.
అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఉత్తరాంధ్ర వర్షాలపై సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్లను అప్రమత్తం చేశారు. రిజర్వాయర్ల నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉండటంతో కాపలా ఏర్పాటు చేయలని ఆదేశించారు.