ఘోర ప్రమాదంలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నైజీరియా నార్త్ సెంట్రల్ నైగర్ స్టేట్‌లోని అగాయ్ ఏరియాలో చోటు చేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్, ప్రయాణీకులు, పశువులతో ప్రయాణిస్తోన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో భారీ పేలుడు సంభవించింది. తరవాత మంటలు వ్యాపించడంతో పదుల సంఖ్యలో పశువులు, 48 మంది నైజీరియన్లు చనిపోయారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందని తెలుస్తోంది.
ప్రమాద ఘటన సంగతి తెలియగానే ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చమురు ట్యాంకర్ నుంచి మంటలు ఇతర వాహనాలకు వ్యాపించడంతో పదుల సంఖ్యలో జనం చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.