జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో రష్యాలో పర్యటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ రష్యా, ఉక్రెయిన్ పర్యటనలు చేశారు. ఆ దేశాల అధ్యక్షులతో శాంతి చర్చలు జరిపారు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ఫోన్లో సంభాషించారు. భారత్, బ్రెజిల్, చైనా మధ్యవర్తిత్వాన్ని ఆహ్వానిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడుతో చర్చలు జరిపిన మోదీ, ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలను ముందుకు తీసుకెళుతున్నారు. ఇందులో భాగంగానే దోవల్ రష్యా పర్యటన ఖరారైంది. అయితే ఆయన ఏ తేదీల్లో రష్యాలో పర్యటిస్తారనే విషయం గోప్యంగా ఉంచారు.
ప్రపంచ దేశాలు రష్యా ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటున్నాయని ఇందుకు భారత్ చొరవచూపడం అభినందనీయమని పలు దేశాధినేతలు ప్రశంసిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపే సత్తా భారత్, చైనాకే ఉందని అగ్రరాజ్యం నమ్ముతోంది. రష్యా అధ్యక్షుడితో దోవల్ శాంతి చర్చలు జరిపే అవకాశం ఉంది. రష్యా షరతులను ఉక్రెయిన్‌తో పంచుకుని ఇరుదేశాల అభిప్రాయాలను గౌరవిస్తూనే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ఆపేలా భారత్ చేస్తున్న ప్రయత్నం ఫలించే అవకాశం కనిపిస్తోంది.