వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా ప్రధాని అయ్యే అవకాశం ఒక్క బీజేపీలోనే ఉందన్నారు.
దేశంలో వారసత్వ రాజకీయాలు చేసే పార్టీ చాలా ఉన్నాయన్న జేపీ నడ్డా, కొన్ని పార్టీలు కొన్ని వర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని అన్నారు. అలాంటి సంప్రదాయానికి బీజేపీ వ్యతిరేకమన్నారు.దిల్లీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
బీజేపీలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉంటాయన్నారు. అందుకు ప్రధాని మోదీనే ఉదాహరణ అని వివరించారు. ఇతర పార్టీల్లో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు.
పేదల అభ్యున్నతి కోసం ఎన్డీయే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుందని జేపీ నడ్డా పేర్కొన్నారు. బడుగుల కోసం పీఎం ఆవాస్ యోజన పథకం కింద నివాసాలు నిర్మిస్తున్నామన్నారు.