మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదిపై నిర్మించిన జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద పోటు పెరగడంతో ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. స్పిల్‌వే ద్వారా 1.67 వేల క్యూసెక్కుల నీటిని వదలగా, ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 1.92 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.05 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా కు ప్రస్తుత నీటి నిల్వ 211.91 టీఎంసీల నీరు నిల్వ చేశారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 67,632 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదిలారు. దీంతో ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.63 లక్షల క్యూసెక్కులు కాగా, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4 టీఎంసీల నీరు ఉంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు