మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. డ్రోన్ బాంబుల దాడుల కలకలం చల్లారక ముందే మరోసారి హింస చెలరేగింది. తాజాగా చెలరేగిన హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జిరిబామ్ జిల్లాలో తాజాగా హింస చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఓ తెగకు చెందిన వ్యక్తిని కొందరు దుండగులు చంపారు. ప్రతీకారంగా జరిపిన దాడులో నలుగురు చనిపోయారు.
డ్రోన్ దాడుల నేపథ్యంలో సైన్యం సోదాలు చేస్తోంది. చూరాచాంద్పూర్లో ఉగ్రవాదులకు చెందిన బంకర్లను సైన్యం ధ్వంసం చేసింది. బిష్ణుపూర్ రాకెట్ దాడులకు ఇక్కడ నుంచే సామగ్రి అందినట్లు అనుమానిస్తున్నారు. మొయిరంగ్లోని మాజీ ముఖ్యమంత్రి మైరెంబమ్ కొయిరెంగ్ ఇంట్లో రాకెట్ పడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మూడు బంకర్లను ధ్వంసం చేసింది.