వరదలో కొట్టుకు వచ్చిన పడవలతో ప్రకాశం బ్యారేజీ గేట్ల కౌంటర్ వెయిట్లు దెబ్బతినగా ఇంజినిరీంగ్ నిపుణులు మరమ్మతులు చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను విజయవంతంగా అమర్చారు. మూడు రోజులుగా భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు రోజుల్లోనే ఇంజినీర్లు, సిబ్బంది మరమ్మతుల పనులు పూర్తి చేశారు.
బ్యారేజీ నుంచి దిగువకు లక్షన్నర క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా సాహసోపేతంగా పనిచేసి పనులు పూర్తి చేశారు. ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి. ప్రస్తుతం గేట్లకు అడ్డుపడిన పడవల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.
67, 68, 69 గేట్లకు బోట్లు అడ్డు పడటంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సక్రమంగా జరగడం లేదు. దీంతో వాటిని తొలగిస్తున్నారు. పడవలు వరదకు కొట్టుకువచ్చాయా లేదా ఎవరైనా కుట్రతో వాటిని వదిలారా అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై నీటిపారుదల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు