ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం కేసులో కీలక నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వాలా అంటూ పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణ ప్రారంభమైన 50 నిమిషాల వరకు సీబీఐ తరపు న్యాయవాది హాజరు కాలేదు. దీంతో మెజిస్ట్రేటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు రాయ్‌కు బెయిల్ ఇవ్వాలా? అంటూ ప్రశ్నించారు. సీబీఐ తరపు న్యాయవాది నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు.
నిందితుడు సంజయ్ తరపున న్యాయవాది కవితా సర్కార్ వాదనలు వినిపించారు. తన క్లెయింట్‌కు బెయిల్ ఇవ్వాలంటూ వాదనలు వినిపించారు. అభియోగాలు మోపే సమయంలో నిందితుడికి బెయిల్ ఇస్తే కేసు పక్కదారి పట్టే ప్రమాదముందని సీబీఐ తరపు న్యాయవాది దీపక్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు.
గత విచారణ సమయంలో సీబీఐ తరపున వచ్చిన న్యాయవాది ఎందుకు రాలేదని రాయ్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. తానే సీబీఐ తరపు శాశ్వత న్యాయవాదినని దీపక్ బదులిచ్చారు.