ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో లవ్‌జిహాద్ ఘటన చోటు చేసుకుంది. అల్తాఫ్ అనే ముస్లిం వ్యక్తి హిందూ పేరుతో పరిచయం చేసుకుని ఒక మహిళను ఆకట్టుకున్నాడు. ఆమెను లైంగికంగా వాడుకున్నాక ఇస్లాంలోకి మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చాడు. బాధిత మహిళ నిరాకరించడంతో ఆమె నాలుగేళ్ళ కూతురిపై అత్యాచారం చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేసారు.
ఈ సంఘటన మొరాదాబాద్ జిల్లా మజ్హోలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు మొరాదాబాద్‌లోని లినేపార్ ప్రాంతంలో నివసిస్తోంది. ఆమెకు వివాహమైంది, నాలుగేళ్ళ కూతురు కూడా ఉంది. బాధితురాలు పని కోసం ప్రతీరోజూ అమ్రోహా వెడుతుంది. ఆ క్రమంలో ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తన పేరు ఆకాష్ అని చెప్పుకున్నాడు. కొన్నాళ్ళకు వారిద్దరి మధ్యా స్నేహం బలపడి బంధంగా మారింది.
బాధితురాలు ఒకరోజు మొరాదాబాద్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నిందితుడు అక్కడికి వెళ్ళాడు. ఆమెపై అత్యాచారం చేసాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించడంతో ఆమెను ఆపడం కోసం పెళ్ళి చేసుకుంటానంటూ నమ్మబలికాడు. ఆ తర్వాతే అతను ఆకాష్ కాదు, అల్తాఫ్ అన్న సంగతి బాధితురాలికి తెలిసింది. అంతేకాదు, అల్తాఫ్ ఆమెను రహస్యంగా అశ్లీలంగా వీడియోలు తీసాడు.
నిందితుడు అల్తాఫ్ తనను ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తన డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఆ వీడియోలను ఆన్లైన్లో పెడతానని బెదిరించాడు. ఆమెను తన భర్తను వదిలిపెట్టి తనతో సహజీవనం చేసేలా ప్రేరేపించాడు. క్రమంగా ఆమెకు మాంసాహారం తినడం, బురఖా వేసుకోవడం, రోజుకు ఐదుసార్లు నమాజు చేయడం వంటి పనులు చేయించాడు. బాధితురాలు తిరస్కరించినపుడల్లా ఆమెను భౌతికంగా హింసించేవాడు.
2024 సెప్టెంబర్ 2న పరిస్థితి మరింత దిగజారింది. అల్తాఫ్ ఆమె ఇంటికి వెళ్ళి, ఆమెను ఇస్లాం మతంలోకి మారిపోవాలని డిమాండ్ చేసాడు. ‘‘మతం మారడానికి నేను ఒప్పుకోలేదు. అప్పుడు అతను నా నాలుగేళ్ళ కూతురి దుస్తులు విప్పేసాడు. నేను ఇస్లాంలోకి మతం మారకపోతే నా పాపను రేప్ చేస్తానని బెదిరించాడు. నేను ఎలాగోలా తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాను. పోలీసులకు నా గోడు వెళ్ళబోసుకున్నాను’’ అని బాధితురాలు వివరించింది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా మొరాదాబాద్ పోలీసులు అల్తాఫ్ మీద కేసు పెట్టారు. ఐపిసి, పోక్సో చట్టాల ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారని నగర ఎస్పి రణ్విజయ్ సింగ్ ధ్రువీకరించారు.