అధిక వర్షపాతం తోడు బుడమేరు పోటుతో నానాయాతన పడుతున్న విజయవాడ వరద బాధితులకు అక్షయపాత్ర అండగా నిలిచింది. వరదలు సంభవించిన నాటి నుంచి 5 రోజులకు గాను సుమారు 10 లక్షల మందికి భోజనం అందజేశారు.
ఈ విషయాన్ని అక్షయపాత్ర విజయవాడ, గుంటూరు ప్రెసిడెంట్ వంశీదాస ప్రభు వెల్లడించారు. దివీస్ ల్యాబ్, ప్రభుత్వ సహకారంతో రికార్డు స్థాయిలో బాధితులకు ఆహారాన్ని అందజేయగల్గామన్నారు.
ప్రభుత్వం ఎప్పుడు, ఎంత అడిగినా అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తాము ఎంత ఆహారం వండినా .. దానిని బాధితుల వద్దకు చేర్చడం గొప్ప విషయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతోనే ఇది సాధ్యమైందన్నారు. అక్షయపాత్ర చరిత్రలో 10లక్షల మందికి ఆహారం అందించడం రికార్డు అన్నారు. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఎన్ని రోజులు , ఎంత సరఫరా చేయమన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.