ఆర్టికల్ 370 ను పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు.
మేనిఫెస్టో లోని హామీలను వివరించిన అమిత్ షా ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తుడిచిపెట్టడం తమ మొదటి ప్రాధాన్యం అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
శాంతియుత, సురక్షిత, సుసంపన్నమైన జమ్మూ కశ్మీర్ తమ లక్ష్యమన్న అమిత్ షా, ఆర్టికల్ 370 ముగిసిన అధ్యాయం అన్నారు. 2014 వరకు వేర్పాటువాదం, ఉగ్రవాదం నీడన ఉన్న జమ్మూ కశ్మీర్ ఆ తర్వాత బయటపడిందన్నారు. 2014 నుంచి జమ్మూ కశ్మీర్ లో స్వర్ణయుగం నడుస్తుందన్నారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్పై ఎఫ్ఐఆర్ నమోదు