వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణలకు రూ.3,300 కోట్ల వరద సాయం ప్రకటించింది.
ప్రస్తుతం తీసుకోవాల్సిన సహాయ చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్టు కేంద్రం పేర్కొంది. ఓ వైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర బృందం నివేదిక అందజేసిన తర్వాత కేంద్రం మరోసారి సాయం ప్రకటించే అవకాశాలున్నాయి.
బుడమేరు గండి పూడ్చేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఇనుప చువ్వలతో బుట్టలు చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు. వాటితో గండిని నింపుతారు. ఈ బుట్టలను గేబియాన్ బుట్టలు అంటారు. మొదటి రెండు గండ్లు 10 నుంచి 15 మీటర్లు ఉండగా , మూడో గండి 100 మీటర్లు ఉంది. దీనిని పూడ్చేందుకు పెద్దమొత్తంలో మట్టి అవసరం అవుతోంది. గేబియాన్ బుట్టలను స్థానికంగా తయారు చేసి గండ్లను పూడ్చేందుకు ఆర్మీ హెచ్ఏడీఆర్ బృందం పనిచేస్తోంది.
మరోవైపు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు