వరదలకు దెబ్బతిన్న పంటలను కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద వరదల్లో మునిగిపోయిన పంటలను బీజేపీ నేతలతో కలసి పరిశీలించారు. కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. ఏపీలో గత వారం రోజులుగా కురిసిన అతి భారీ వర్షాలకు 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి, పసుపు, కూరగాయల పంటలు, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులకు పంటల బీమా అందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్దంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి చెప్పారు. కేంద్ర మంత్రి వెంట గ్రామీణాభివృద్ధి, ఐటీ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు.