బుడమేరు పొంగిన కారణంగా విజయవాడ శివారు కాలనీల్లోని నివాసాల్లోకి పెద్ద మొత్తంలో వరద చేరింది. బుడమేరు కొంత శాంతించడంతో వరద తగ్గింది. అయితే నివాసాల్లో భారీగా బురద, చెత్త పేరుకుపోయింది. దీంతో నివాసాలు, రహదారులు, డ్రెయిన్లను ఫైరింజన్లతో శుభ్రం చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సహాయ చర్యలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరగడంపై ఏపీ పోలీసులు స్పందించారు. విపత్తు సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా పోస్టులు పెడితే తీవ్ర చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
పుకార్లు పుట్టించి వ్యాప్తి చేసేవారిపైనా, క్లిష్ట సమయాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే సంఘ వ్యతిరేక శక్తులపై న్యాయపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. “విజయవాడలో నీట మునిగిన కాలనీలు శుభ్రం చేసే సిబ్బంది స్థానికుల కులం అడుగుతున్నారని? అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను షేర్ చేసిన ఏపీ పోలీసులు, ఫేక్ ప్రచారం సరికాదని హితువు చెప్పారు.