గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఏపీ పోలీసులు పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేశారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ, గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత లేళ్ళ అప్పిరెడ్డిని బెంగళూరులో ఏపీలో పోలీసులు నిర్బంధించి ఏపీకి తీసుకొచ్చారు. ఆయనను కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు.
ఈ కేసులో మాజీ నందిగం సురేశ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు.
వైసీపీ నేతలు తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వారి కోసం పోలీసు 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు నుంచి రక్షణ కోసం పలువురు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు నిరాకరించింది.