ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు మేరకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , విజయవాడలోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రి నారా లోకేశ్ తో కలిసి ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
బుడమేరు, క్యాచ్‌మెంట్ , జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ వరద బీభత్సాన్ని తెలుసుకున్నారు.
ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర జరుగుతున్న పనుల గురించి తెలుసుకుంటారు.
తర్వాత జక్కంపూడి కాలనీ లోని మిల్క్ ఫ్యాక్టర్టీ ప్రాంతాన్ని ఎన్డీఆర్ఎఫ్ బోట్‌లో వెళ్లి పరిశీలిస్తారు. అక్కడి నుంచి విజయవాడ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని వరద పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చూడనున్నారు.
పర్యటన సందర్భంగా ఏపీకి వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ కు గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, బీజేపీ ఏపీ చీఫ్, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే సుజనాచౌదరియ స్వాగతం పలికారు.