ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వేటు పడింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, బాధితురాలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా హింసించాడని ఆ వివరాలన్నీ పెన్ కెమెరా ద్వారా రికార్డు చేసినట్లు బాధితురాలు లేఖలో తెలిపారు. తిరుపతి బీమాస్ హోటల్‌కు పిలిపించి లైంగిక దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. దీనిపై టీడీపీ అధ్యక్షుడు పీలా శ్రీనివాసరావు పార్టీ నుంచి ఆదిమూలంను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కోనేటి ఆదిమూలం ఎన్నికలకు ముందు వైసీపీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సత్యవేడు టీడీపీ టికెట్ విషయంలోనూ కొందరు వ్యతిరేకించారు. అలాంటి వారిలో ప్రస్తుతం లైంగిక దాడి బాధితురాలు కూడా ఉన్నారు. తనపై మూడు సార్లు లైంగిక దాడి చేశాడని, వాట్సప్‌లో అసభ్యకరంగా మెసేజీలు పెట్టాడని, అన్ని ఆధారాలు ఉన్నట్లు బాధిత మహిళ రాసిన లేఖలో వివరించారు.