గోదావరికి వరద పోటు మరింత పెరిగింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 11 అడుగులు కాగా సముద్రంలోకి 8.80 లక్షల క్యూసెక్కులు వదిలారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 44.3 అడుగులుగా నమోదైంది. దీంతో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువకు 9,74,666 క్యూసెక్కులు వదిలారు.
గోదావరికి వరద పెరగడంతో శబరి నది ఎగపోటుకు గురైంది. చింతూరు మండల పరిధిలోని వాగులు పొంగుతున్నాయి. విలీన మండలాల్లో రహదారులు ముంపునకు గురయ్యాయి. దీంతో 48 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో 11 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు