ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలోని ఈ ఘటన చోటుచేసుకుంది.
మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న సహా ఆయన దళానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు. ఓ గ్రేహౌండ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఈ దళానికి లచ్చన్న నాయకత్వం వహిస్తున్నాడని వెల్లడించారు.
రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-బస్తర్ జిల్లాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత జగన్ ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న జగన్ అసలు పేరు మాచర్ల ఏసోబు అలియాస్ రణ్‌దేవ్ దాదా. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని టేకులగూడం జగన్ స్వగ్రామం.