పారిస్ పారాలింపిక్స్‌లో భారత కు పతకాల పంటపండింది. పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో ఆర్చర్ హర్విందర్ సింగ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్లో పోలాండ్‌కు చెందిన లుకాస్జ్ సిజెక్‌ను 6-0తో ఓడించి స్వర్ణం సాధించాడు.
పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ ఆర్చర్‌గా హర్విందర్ సింగ్ రికార్డు క్రియేట్ చేశాడు. హర్విందర్(33) టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్యం గెలిచాడు.
టోక్యో పారాలింపిక్స్ -2020లో భారత్ 19 పతకాలు సాధించింది. పారిస్ పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో 24 పతకాలు చేరాయి. ఇందులో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. మొత్తంగా పతకాల పట్టికలో భారత్ 13వ స్థానంలో ఉంది.
పతకాల పట్టికలో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాలో గ్రేట్ బిటన్ , యూఎస్ఏ ఉన్నాయి. నాలుగో స్థానంలో నెథర్లాండ్స్ ఉన్నాయి.