భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాలు ముంపునకు గురికావడంతో భారీ గా ఆస్తినష్టంతో పాటు పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నష్టం అంచనాకు కేంద్ర బృందం నేడు ఏపీకి రానుంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో ఇంటర్ మినిస్టీరియల్ టీం పర్యటించనుంది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి (డీఎం అండ్ పీఎం) సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని అధికారులు వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు.
బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) సలహాదారు కల్నల్ కేపీ సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ (సీడబ్ల్యుసీ) సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాదు ఎస్ఇ(కేసీపీ) ఎం రమేశ్ కుమార్, ఎన్‌డీఎస్ఏ సదరన్ జోన్ చెన్నైకి చెందిన డైరెక్టర్ ఆర్ గిరిధర్, ఎన్‌డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వివియన్ ప్రసన్న క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. బాధితులతో మాట్లాడనున్నారు.