వరదలపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సహాయ చర్యల పర్యవేక్షణలో భాగంగా సీఎం చంద్రబాబు, వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నేరస్తులను, తప్పుడు ప్రచారం చేసేవాళ్లను సంఘ బహిష్కరణ చేయాలన్నారు. ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు రాక్షసులతో పోరాడాల్సి వస్తోందన్నారు. విజయవాడకు కృష్ణా నది కంటే బుడమేరుతోనే ప్రమాదం అన్నారు. బుడమేరు ఆక్రమణలపై గత ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పునరుద్ఘాటించిన చంద్రబాబు, అందరికీ నాణ్యమైన ఆహారం అందజేస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. కృష్ణా నదికి మరో 40 వేల క్యూసెక్కుల వరద వస్తే విజయవాడకు మరింత ప్రమాదం అని అన్నారు.