ప్రధాని నరేంద్రమోదీ బ్రూనై పర్యటన ముగించుకుని సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ ప్రభుత్వం, ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక నృత్యాలు, సంగీత ప్రదర్శనల మధ్య సింగపూర్ లో నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. ఓ మహిళ మోదీకి రాఖీ కట్టింది. కళాకారులతో ముచ్చటించిన మోదీ, కాసే ఢోలు వాయించి సందడి చేశారు. మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం ‘లావణి’ని ప్రదర్శిస్తుండగా.. ప్రధాని మోదీ కూడా వారితో కలిసిపోయారు.
పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారె న్స్ వాంగ్, అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, ఇతర మంత్రులతో సమావేశం కానున్నారు. భారత్-సింగపూర్ స్నేహాన్ని పెంపొందించే లక్ష్యంతో జరిగే సమావేశాల కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ మోదీ తన సోషల్ మీడగియా అకౌంట్ లో ట్వీట్ చేశారు.